రొమాంటిక్ కామెడీ చిత్రాలతో పాటు చారిత్రక నేపథ్య చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో వికీ కౌశల్. ఈ క్రమంలో ఆయన మరో హిస్టారికల్ మూవీలో నటించబోతున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించనున్న చారిత్రక నేపథ్య సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ పాత్రను వికీ పోషించబోతున్నారు. ‘లూకా చుప్పీ’, ‘మిమి’ వంటి చిత్రాలతో కమర్షియల్ విజయలతో పాటు అవార్డులూ అందుకున్నారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. వికీ కౌశల్ హీరోగా ఆయన ఈ ప్రాజెక్ట్ ప్రకటించడంతో అంచనాలు ఏర్పడుతున్నాయి. మ్యాడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజాన్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. వికీ కౌశల్ గతంలో ‘సంజూ’, ‘ఉరి’, ద సర్జికల్ స్ట్రైక్’, ‘షాహీద్ ఉద్దమ్ సింగ్’ వంటి నిజ జీవిత కథల్లో నటించే పేరు తెచ్చుకున్నారు.