శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘జీవ పిండం బ్రహ్మాండం’ అనే పాటను ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడిన ఆయన ఈ పాట కథ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి భావంతో సాగిందన్నారు. ఈ స్థాయి భయానక చిత్రాన్ని తెలుగు తెరపై ఇప్పటివరకు చూసి ఉండరని, ప్రతీ సన్నివేశం భయపెడుతుందని దర్శకుడు తెలిపారు. హారర్ జోనర్లో ఇదొక విభిన్నమైన ప్రయోగమని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి.