Daksha Nagarkar | గ్లామర్ డాల్ అని పిలిస్తే ఇష్టమే
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా కనిపించనున్నారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా కనిపించనున్నారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలపై నాయిక దక్షా నగార్కర్ మాట్లాడుతూ…‘రవితేజతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో దర్శకుడు చెప్పాక సంతృప్తికరంగా అనిపించింది.
ఈ సినిమాలో నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేసేలా కనిపిస్తాను. మనం చూసిన దక్షా ఈమేనా అనిపిస్తుంది. అంత వైవిధ్యంగా నా పాత్ర సాగుతుంది. ఇందులో ఐదుగురు నాయికలు ఉన్నా నా పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. దానికి ఎంతవరకు నటిగా న్యాయం చేయగలను అనేది ప్రయత్నించాను. దర్శకుడిగా సుధీర్ వర్మ ప్రతిభ గురించి నాకు తెలుసు. ఆయన గత చిత్రాలు మనల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం సుధీర్ చాలా ప్రిపేర్ అయ్యాడు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తెరకెక్కించాడు. ‘హోరా హోరీ’, ‘హుషారు’, ‘జాంబీరెడ్డి’ ఇలా ప్రతి సినిమాలో నాకు వైవిధ్యమైన క్యారెక్టర్స్ దక్కాయి. గ్లామర్ డాల్ అనే ముద్ర ఇష్టమే కానీ నటిగానూ పేరు తెచ్చుకోవాలని ఉంది. చాలా కాలం కెరీర్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇటీవల యాక్టింగ్ కోర్స్ కూడా పూర్తి చేశాను. అందరు హీరోలతో కలిసి నటించాలని ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాలు అంగీకరించాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

