Payal Ghosh | మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగాలీ భామ పాయల్ ఘోష్ (Payal Ghosh). ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లిలో చిత్ర పాత్రలో మెరిసింది. ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. పాయల్ ఘోష్ కొత్త సినిమా అప్డేట్ సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, మరోవైపు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
ఇండస్ట్రీలో ఎక్కువ పాత్రల్లో నటించే అవకాశం రావాలంటే.. కమిట్మెంట్ (you need to sleep) ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో.. తన అనుభవాలను షేర్ చేసుకోవాలని ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ స్పందిస్తూ.. ఫైర్ ఆఫ్ లవ్: రెడ్ Fire Of Love: Redసినిమాతో నా 11వ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తా. నేను ఎవరితోనైనా కమిట్ అయితే. ఇది 30వ సినిమా అయ్యుండేదని చెప్పుకొచ్చింది. పాయల్ ఘోష్ గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
పెద్ద సినిమాల్లో అవకాశం రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. ఎవరితో కమిట్ అవ్వకుండా.. అది సాధ్యం కాదు.. ఇండస్ట్రీలో రాణించాలనుకునే అప్‌కమింగ్ యాక్టర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెబుతూ.. పని చేసుకునే వాతావరణం ప్రాధాన్యతను మరోసారి అందరికీ గుర్తు చేసి ట్రెండింగ్‌లో నిలుస్తోంది పాయల్ ఘోష్. మరి పాయల్ ఘోష్ కామెంట్స్‌పై ఇండస్ట్రీ ప్రముఖులెవరైనా స్పందిస్తారా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు, నెటిజన్లు.
ఫైర్ ఆఫ్ లవ్: రెడ్ ట్రైలర్..