Year End 2023 | ప్లే బ్యాక్ 2023.. హిందీ డబ్బింగ్ సినిమాలకు స్వర్ణయుగం..!
Year End 2023 | ఎప్పుడైనా మనకు డబ్బింగ్ సినిమాలు అంటే తమిళం నుంచి వచ్చినవి మాత్రమే. అప్పుడప్పుడూ మనకు మరీ జాలి ఎక్కువైపోతే.. కథ కనెక్ట్ అయితే కన్నడ సినిమాలు చూస్తుంటారు. ఇక మలయాళం సినిమాలైతే ఎప్పుడో కానీ ఎక్కవు. కానీ 2023లో మాత్రం బాలీవుడ్ సినిమాలకు కూడా మంచి రోజులు వచ్చాయి మన దగ్గర.
Year End 2023 | ఎప్పుడైనా మనకు డబ్బింగ్ సినిమాలు అంటే తమిళం నుంచి వచ్చినవి మాత్రమే. అప్పుడప్పుడూ మనకు మరీ జాలి ఎక్కువైపోతే.. కథ కనెక్ట్ అయితే కన్నడ సినిమాలు చూస్తుంటారు. ఇక మలయాళం సినిమాలైతే ఎప్పుడో కానీ ఎక్కవు. కానీ 2023లో మాత్రం బాలీవుడ్ సినిమాలకు కూడా మంచి రోజులు వచ్చాయి మన దగ్గర. హిందీ అనువాదాలు మన దగ్గర 10 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప అనుకునేవాళ్లం కానీ 2023లో మాత్రం 3 సినిమాలు ఏకంగా 50 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలకు తెలుగులో మార్కెట్ ఓపెన్ అయింది.
పఠాన్:
షారుక్ ఖాన్ సినిమాలకు ఏపీ, తెలంగాణలోనూ ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. అయితే ఆయన నటించిన హిందీ సినిమాలే ఇక్కడ 10 కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ 2023లో మాత్రం అలా కాదు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన పఠాన్‌తో టాలీవుడ్‌లోనూ ఊచకోత కోశాడు షారుక్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు వర్షన్ 60 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది.
జవాన్:
పఠాన్ మత్తులో ఉండగానే జవాన్ కూడా వచ్చి సంచలనాలు రేపింది. అట్లీ కుమార్ తెరకెక్కించిన జవాన్ తెలుగులోనూ దుమ్ము దులిపేసింది. తెలుగులో 75 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. జవాన్‌తో తమిళ దర్శకుడు అట్లీకి హిందీలోనూ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా 1150 కోట్లు వసూలు చేసి షారుక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
గదర్ 2:
తెలుగులో అనువాదం కాకపోయినా హిందీ వర్షన్‌తోనే తెలుగు రాష్ట్రాల్లోనూ రప్ఫాడించాడు సీనియర్ హీరో సన్నీ డియోల్. గదర్ 2 సినిమాకు మన దగ్గర చాలా మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా హిందీ వర్షనే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకు వచ్చింది.
యానిమల్:
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 850 కోట్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యంగా సందీప్ మేకింగ్ యానిమల్కు మేజర్ ప్లస్ అయింది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు దూరంగా ఉన్నా కేవలం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌తోనే 850 కోట్లకు పైగా వసూలు చేసింది యానిమల్. తెలుగులోనూ 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఎలా చూసుకున్నా తెలుగులో ఈ సారి హిందీ సినిమాల పంట పండింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సల్మాన్ ఖాన్ స్పై థ్రిల్లర్ టైగర్ 3 మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

