Toxic Movie | కన్నడ స్టార్ నటుడు యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా స్పందిస్తూ క్లారిటీనిచ్చింది. ఈ సినిమాను అనుకున్న తేదీ ప్రకారమే జూన్ 4 వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. తొలుత ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ ఇరాన్ -ఆమెరికా వార్ నేపథ్యంలో వాయిదా వేసుకుంది.
ప్రస్తుతం యశ్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సినీమాకాన్’ వేడుకలో పాల్గొంటున్నారు. దీనిని కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లోనూ భారీగా విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. 1940 నుండి 1970 మధ్య కాలంలో గోవా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు.