Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Ramayana | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’ నుంచి మేకర్స్ దసరా పర్వదినం సందర్భంగా ఒక పవర్ఫుల్ మ్యూజికల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Yash | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రామాయణం’ నుంచి మేకర్స్ దసరా పర్వదినం సందర్భంగా ఒక పవర్ఫుల్ మ్యూజికల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాక్‌స్టార్ యశ్ అత్యంత శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో నటిస్తుండగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ వీడియోలో యశ్ రావణుడి గెటప్‌లో కనిపిస్తూ తన ఇంటెన్స్ లుక్ మరియు భీకరమైన అభినయంతో అంచనాలను తారాస్థాయికి చేర్చారు.
సుమారు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో రావణుడి భక్తి, శివుడిపై అతనికి ఉన్న నిబద్ధతను ఎంతో గ్రాండ్‌గా చూపించారు. చేతిని కోసుకుని నుదుట త్రిపుండ్ర ధారణ చేయడం, శివుడి విగ్రహం ముందు హారతి ఇవ్వడం, ఆపై ‘శివ తాండవస్తోత్రం’ బ్యాక్‌గ్రౌండ్‌లో రావణుడు చేసే ఉగ్ర తాండవం ప్రేక్షకులను రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, డాక్టర్ కుమార్స్ విశ్వాస్ సాహిత్యం సమకూర్చారు. హిందీ వెర్షన్‌కు విశాల్ దద్లానీ తనత్రం అద్భుతమైన గాత్రం అందించారు. రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

