బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఇటీవలే యురి ఫేం ఆదిత్యాధర్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యామీ గౌతమ్-ఆదిత్యాధర్ వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా యామీ గౌతమ్ కొత్త పెండ్లి కూతురు గెటప్ లో ఉన్న నయా స్టిల్ ను అందరితో పంచుకుంది. గోల్డ్ వర్క్ చేసిన రెడ్ శారీ అండ్ జ్యువెలరీలో,రెడ్ లిప్ స్టిక్, నుదిటన సింధూరంతో కెమెరాకు ఫోజులిచ్చిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మిషన్ కశ్మీరీ చిత్రంలోని పాట లైన్స్ ను గుర్తు చేస్తూ..వసంత రుతువుకు స్వాగతం పలుకుదాం అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. జూన్ 4న యామీ గౌతమ్-ఆదిత్యా ధర్ వెడ్డింగ్ జరిగింది. యామీ ప్రస్తుతం దస్వి, ఏ థర్స్ డే, భూత్ పోలీస్ సినిమాలు చేస్తోంది. వీటితోపాటు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్