క్రైమ్ జర్నలిస్ట్ పాత్రలో

ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది హిమచల్ సొగసరి యామీగౌతమ్. ‘ఉరి’ చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడు ఆదిత్యధర్తో యామీగౌతమ్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కారు. కొన్నాళ్లుగా వివాహ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న యామీ గౌతమ్ తిరిగి సినిమాలపై దృష్టిసారిస్తోంది. మంగళవారం ఆమె ‘లాస్ట్’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘పింక్’ ఫేమ్ అనిరుద్ధా రాయ్ చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో యామీగౌతమ్ క్రైమ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సమాజంలో నైతిక విలువలు, మంచితనం ఎలా పతనమవుతున్నాయనే అంశాన్ని ఆవిష్కరిస్తూ సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామా కథాంశంతో సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దంపడుతూ సాగే ఈ చిత్రంలో యామీగౌతమ్ పాత్ర ప్రయోగాత్మకంగా సాగనున్నట్లు సమాచారం. పంకజ్కపూర్, రాహుల్ ఖన్నా, పియాబాజ్పాయ్ ఈ చిత్రలో కీలక పాత్రలను పోషించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

