Yami Gautam | నటి యామి గౌతమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఆ బాబుకి ‘వేదవిద్’ అని నామకరణం చేసినట్టు ఆయన ఆ పోస్ట్‌లో తెలియజేశారు. ఈ విషయంపై యామి గౌతమ్ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
‘ఇప్పటివరకూ ఒక ప్రయాణం.. ఇక నుంచి మరో ప్రయాణం. నా బిడ్డను తొలిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు. ఇక మా జీవితం వాడికోసమే. మా కలలన్నీ వాడికోసమే. మా కుటుంబానికే కాక, దేశానికే గర్వకారణం అయ్యేలా వాడ్ని పెంచుతాను. వాడెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నా’ అంటూ పేర్కొన్నది యామి గౌతమ్. తల్లి అయిన యామి గౌతమ్‌కి ఆభిమానులేకాక, సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.