‘లక్కీ భాస్కర్’ జీవిత సత్యాలు
ఒకరోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోలేను కదా’.. ‘దిస్ ఈజ్ ఇండి యా..వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి’..ఇలాంటి సంభాషణలు ‘లక్కీ భాస్కర్' సినిమాలో కోకొల్లలుగా వినిపిస్తాయి.
‘ఒకరోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోలేను కదా’.. ‘దిస్ ఈజ్ ఇండి యా..వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి’..ఇలాంటి సంభాషణలు ‘లక్కీ భాస్కర్’ సినిమాలో కోకొల్లలుగా వినిపిస్తాయి. 1990 దశకంలో దేశాన్ని కుదిపేసిన స్టాక్మార్కెట్ కుంభకోణం ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రైటింగ్ విషయంలో దర్శకుడు వెంకీ అట్లూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సంభాషణలు సన్నివేశాల్లోని భావోద్వేగాల్ని మరింతగా ఎలివేట్ చేశాయి. అవి కేవలం సంభాషణలు కాదు..కఠోర జీవిత సత్యాలు అనే ప్రశంసలు దక్కాయి. కెరీర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలకే పరిమితమైన వెంకీ అట్లూరి..విద్యా వ్యవస్థపై తీసిన ‘సర్’, ఆర్థిక నేరాల ఆధారంగా తీసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రాలతో దర్శకుడిగా మరోస్థాయికి చేరుకున్నారు. తాజాగా ఉత్తమ సంభాషణల రచయితగా జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కినట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

