లాస్ ఏంజెల్స్: ప్రముఖ నటుడు, ఆస్కార్ విజేత విల్ స్మిత్‌పై (Will Smith) మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకున్నది. ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొనకుండా పదేండ్లపాటు నిషేధం విధించింది. అకాడమీ నిర్వహించే ఇతర వేడుకలకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కాగా, అకాడమీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని విల్ స్మిత్ స్పందించారు. ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వ్యాఖ్యతగా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ కొట్టిన విషయం తెలిసిందే. తన భార్యపై జోకులు వేయడంతో కోపంతో ఊగిపోయిన స్మిత్.. వేదికపైనే క్రిస్ రాక్ చెంప చెల్లుమనించారు. అయితే అనంతరం అకాడమీకి, సహచరులకు క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారం కాస్తా వివాదంగా మారడంతో.. స్మిత్‌పై అకాడమీ చర్యలు తీసుకున్నది.