Miss Shetty Mr Polishetty| త్వరలో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి, లేడీ లక్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే సినిమా విడుదల తేదీని ఫైనల్ చేస్తూ విడుదల చేసిన కొత్త లుక్‌లో స్వీటీ సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ.. నాలుగు పదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సెప్టెంబర్ 7 సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఇప్పటివరకు నవీన్ పొలిశెట్టి మాత్రమే సోలోగా ప్రమోషన్స్‌లో చేస్తున్నాడు. స్వీటీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరో మూడు రోజుల్లో సినిమా రాబోతుండగా.. అనుష్కా శెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యక్షం కానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మేకర్స్ మాత్రం ఈవెంట్ ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ డేట్ ఫిక్సయితే స్వీటీ ఈవెంట్‌కు వస్తుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరి మేకర్స్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే కానీ దీని గురించి ఏం చెప్పలేని పరిస్థితి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని అనుష్క రానున్న రోజుల్లోనైనా ప్రమోషన్స్ లో కనిపిస్తుందంటూ కొంతమంది నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశ నెరవేరుతుందో..లేదో..? చూడాలి మరి.
ఇప్పటికే లాంఛ్ చేసిన Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తుండగా.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతున్నాడు. Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..