Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
Allu arjun | ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) సీజన్ 9లో పాల్గొన్న సందర్భంలోని ఒక ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Vijay Deverakonda | ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan)షోలో పాల్గొన్న సందర్భంలోని ఒక ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షోలో భాగంగా గేమింగ్ రౌండ్లో సెలబ్రిటీ ఫ్రెండ్‌కు కాల్ చేయాలనే టాస్క్ రాగా, విజయ్ దేవరకొండ నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాత్రి 11.40 గంటలకు ఫోన్ చేశారు.
అయితే అంత రాత్రి వేళలో కాల్ చేయడానికి కారణం ఏంటో విజయ్ సరదాగా వివరిస్తూ.. “అసలు వీళ్లకు (షో నిర్వాహకులకు) టైమ్ సెన్స్ లేదు. రాత్రి 11.40 గంటలకు ఎవరో ఒకరికి కాల్ చేయమన్నారు” అని అన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలో తనపై ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తిని, ఏ మాత్రం కోప్పడకుండా ఫోన్ లిఫ్ట్ చేసే వ్యక్తిని తాను మొదటగా ఎంచుకున్నానని, అందుకే బన్నీ అన్నకి కాల్ చేశానని విజయ్ తెలిపారు.
అది విన్న అల్లు అర్జున్ చాలా కూల్‌గా స్పందించి, “ఇట్స్ ఓకే, పర్వాలేదు.. నువ్వు కాల్ చేయడం చాలా స్వీట్” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆ సంభాషణ మరింత సరదాగా సాగింది. ఈ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
That adorable call to Bunny! ❤️✨
#VijayDeverakonda’s love and admiration for #AlluArjun is truly heartwarming. This brotherly bond is pure love! 🫶🏻 https://t.co/PEfaZzQUDP
— Indian Clicks (@IndianClicks) October 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

