Yami Gautam | మన గురించి ప్రజలెందుకు ఆలోచించాలి.. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాతో పంచుకోవాలా?: యామీ గౌతమ్
కళాకారులు తమ కళారూపాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు చేరువ కావాలి తప్ప.. వ్యక్తిగతంగా కాకూడదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. అందుకే.. సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా.. దాన్ని తక్కువగా వాడతాను.’ అంటున్నది అందాలభామ యామీ గౌతమ్.
Yami Gautam | కళాకారులు తమ కళారూపాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు చేరువ కావాలి తప్ప.. వ్యక్తిగతంగా కాకూడదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. అందుకే.. సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా.. దాన్ని తక్కువగా వాడతాను.’ అంటున్నది అందాలభామ యామీ గౌతమ్. ఇంకా ఆమె చెబుతూ ‘ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు వారి జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాతో పంచుకుంటున్నారు. తినే తిండి దగ్గరనుంచి ఖాళీ సమయాల్లో తమ జీవన విధానం వరకూ ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
అది మంచి పద్ధతి కాదు. మన జీవితంలో జరిగే ప్రతీది సమాజానికి అక్కర్లేదు. అసలు మన గురించి ప్రజలు ఎందుకు ఆలోచించాలి?. వాళ్లకు మన గురించి ఎంత తక్కువ తెలిస్తే.. మన పాత్రలు వాళ్లకు అంత ఎక్కువ కనెక్ట్ అవుతాయ్. తెరపై కనిపించగానే మన వ్యక్తిగత జీవితం వాళ్లకు గుర్తురాకూడదు.’ అని అభిప్రాయపడ్డారు యామీ గౌతమ్. తన కుమారుడి గురించి మాట్లాడుతూ ‘నా కొడుకుని కూడా మీడియాకు దూరంగా పెంచాలనుకుంటున్నా. వాడు సెలబ్రిటీ కొడుగ్గా కాకుండా సామాన్యుడిగా పెరగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు యామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

