Godfather | గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కు పూరీ ఎందుకు రాలేదు.. కారణమేంటి?
Godfather | గాడ్ ఫాదర్ సినిమాకు కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో రాకపోయినా పాజిటివ్ టాక్ చూసుకొని పండగ చేసుకుంటున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే సక్సెస్ మీట్ లో సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ వచ్చారు.
Godfather | ఆచార్య సినిమాకు ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కూడా చిరంజీవి చెవిన పడలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చేశాను రా బాబు అనేలా చీల్చి చెండాడారు విశ్లేషకులు. అలాగే దీనికి వచ్చిన విమర్శలు తట్టుకోలేక చాలా కాలం పాటు చిరంజీవి మీడియా ముందుకు కూడా రాలేదు.. వచ్చిన తర్వాత కూడా కొరటాల శివపై తన అక్కసు వెల్లకక్కుతూనే ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడ లేని సంతోషంతో గాలిలో తేలిపోతున్నాడు చిరంజీవి. మూడు రోజుల తర్వాత ఏకంగా సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు.
కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో రాకపోయినా కూడా పాజిటివ్ టాక్ చూసుకొని పండగ చేసుకుంటున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే సక్సెస్ మీట్ లో సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ వచ్చారు. కేవలం ఒక్క పాట కోసం పనిచేసిన చోట కే నాయుడు కూడా అక్కడ కనిపించాడు. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో అత్యంత కీలక పాత్రలో నటించిన పూరి జగన్నాథ్ మాత్రం స్టేజి మీద కనిపించలేదు.
ఆయనతో పాటు నయనతార కూడా రాలేదు. నయనతార అంటే ఏ సినిమా ప్రమోషన్ కు రాదు కాబట్టి ఆమె గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పూరీ రాకపోవడం వెనక మాత్రం కచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అసలు చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కు పూరీని పిలిచాడా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఈ విషయంలో మెగాస్టార్ మనస్తత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే పూరీ జగన్నాథ్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి చిరంజీవి ఆహ్వానం పంపాడని.. అయితే తాను రాలేనని సున్నితంగా జగన్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం గోవాలో తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో పూరీ బిజీగా ఉన్నాడు. ఎందుకంటే విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. లైగర్ ప్లాప్ తర్వాత పూరితో సినిమా అంటే భయపడుతున్నారు నిర్మాతలు. హీరోలు కూడా ఈయనతో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పూరి బయటికి రావడానికి అసలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
అందుకే స్వయంగా చిరంజీవి ఫోన్ చేసిన కూడా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో పూరి కనిపించలేదు. కానీ సినిమాలో ఆయన పోషించిన ఫ్రస్టేటెడ్ జర్నలిస్టు పాత్ర అదిరిపోయేలా పేలింది. అందుకే సక్సెస్ మీట్ లో చిరంజీవితో పాటు స్టేజి మీద పూరి కూడా కనిపించి ఉంటే అదిరిపోయేది అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కచ్చితంగా పూరి, చిరంజీవి ఒకే స్టేజి మీద కనిపిస్తారని అభిమానులు నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి..
Trivikram srinivas | త్రివిక్రమ్ అప్పట్లో అంత దారుణంగా ఉండేవాడా.. ఆ అలవాట్లు ఉన్నాయా?
Surrogacy | నయనతార ఈ వివాదాన్ని ముందే ఊహించిందా.. ఆమె రియాక్షన్ ఇదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

