Jahnvi Kapoor | తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్నభామల్లో టాప్‌లో ఉంటుంది జాన్వీకపూర్. భక్తి భావం ఎక్కువున్న బాలీవుడ్ ముద్దుగుమ్మల జాబితాలో కూడా ముందు వరుసలో ఉంటుంది. దివంగత అందాల తార శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ అభిమానులు, ఫాలోవర్లకు తల్లికి తగ్గ తనయగా ఎప్పుడూ స్పూర్తిగా నిలుస్తూ ఉంటుంది.
సాధారణంగా సెలబ్రిటీలు ప్రఖ్యాత ఆలయాలను సందర్శించాలంటే వీఐపీ దర్శనం సౌకర్యం రెడీగా ఉంటుందని తెలిసిందే. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు వీఐపీ దర్శనం ద్వారా వెళ్తుంటారు. కానీ జాన్వీకపూర్ మాత్రం తనకు సులువుగా దేవుడిని దర్శించుకునే అవకాశమున్నప్పటికీ ఆ మార్గాన్ని వద్దనుకోవడం విశేషం. జాన్వీకపూర్ ఎప్పుడూ చూసినా మెట్ల మార్గం గుండా వెళ్లి దేవుడిని దర్శించుకోవడం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు తిరుపతికి వెళ్లినా సాధారణ ప్రజల్లాగే కాలినడకన వెళ్లి తిరుమలేశుడిగా దర్శించుకుంటే గానీ ఈ భామకు సంతృప్తి కలగదట.
ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఒక్కసారి లభించినా చాలని భక్తులు గంటల తరబడి ఎలా వేచి ఉంటారో నాకు బాగా తెలుసు. నాకు అలాంటి సమయం దొరకడం పట్ల ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తా. ఏదేమైనా సరే నేను ప్రతిసారీ ఆ 3500 మెట్లనూ ఎక్కితే తప్ప, నా దర్శనం పరిపూర్ణమైనట్లు నాకు అనిపించదు. నేను కేవలం నేరుగా వెళ్లి దర్శనం చేసుకుని రాలేను. ఆ మెట్లన్నీ ఎక్కినప్పుడే నా దర్శన యాత్ర సంపూర్ణమైనట్లుగా భావిస్తానంటూ చెప్పుకొచ్చింది’ జాన్వీకపూర్.
ఈ బ్యూటీ తను ఓ సెలబ్రిటీని అని ఏమాత్రం గర్వం లేకుండా ఇలా ప్రతీసారి కాలినడకన ఒక్కో మెట్టు ఎక్కి ప్రజల నుంచి అభిమానులను ప్రశంసలు అందుకుంటోంది. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పకనే చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
జాన్వీకపూర్ ప్రస్తుతం రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న పెద్దిలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. దేవరతో తెలుగు డెబ్యూ ఇచ్చిన జాన్వీకపూర్‌కు తెలుగులో పెద్ది రెండో సినిమా.
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్‌లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?