Akash Puri | ఆకాశ్ పూరీ పేరు ఎందుకు మార్చుకున్నాడు?
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన పేరును ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన పేరును ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుంది. తండ్రి పేరులోని పూరీని యాడ్ చేసుకుని గతంలో తన పేరును ఆకాశ్పూరీగా వుంది. అయితే తాజాగా పూరి ప్లేస్‌లో జగన్నాథ్ యాడ్ అయ్యింది.
చిరుత, బుజ్జిగాడు చిత్రంతో బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆకాశ్ జగన్నాథ్ ఆ తరువాత మోహబూబ, రోమాంటిక్, చోర్ బజార్ తదితర సినిమాల్లో నటించారు అయితే ఏ చిత్రం కూడా ఆకాశ్‌కు సరైన సక్సెస్‌ను అందించలేకపోయింది. కాగా వున్నట్టుండి ఆకాశ్ తన పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో తెలియదు. అయితే గత కొంతకాలంగా సక్సెస్ లేకపోవడంతో జాతక రీత్యా పేరును మార్చకున్నాడని కొంత మంది అంటున్నారు. పేరు బలం కోసం నేమ్‌లో మార్పులు చేస్తే హీరోగా సక్సెస్ అవుతావు అని కొంత మంది సలహా మేరకే ఈ పేరు మార్పు అని అంటున్నారు.
అయితే ఆ మధ్య ఆకాశ్ జగన్నాథ్ నటించిన ఓ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న బండ్ల గణేష్ ఆకాశ్‌ను పూరి జగన్నాథ్ పట్టించుకోవట్లేదని కన్న కొడుకును కాదని ఎవరినెవరినో పూరి హీరోలుగా తయారుచేస్తున్నాడని మీరు దయచేసి మీ కొడుకుతో ఓ సూపర్‌హిట్ సినిమా తీయ్యండి. కన్నకొడుకు, కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదని ఆ వేడుకలో బండ్ల గణేష్ విమర్శించిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తరువాత బండ్ల గణేష్ తన పాడ్‌కాస్ట్ ద్వారా పూరి జగన్నాథ్ ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. సో ఏది ఏమైనా ఆకాశ్ జగన్నాథ్ త్వరలోనే మంచి కమర్షియల్ హిట్ సాధించాలని పేరు మార్పు అతనికి సక్సెస్‌ను తీసుకరావాలని ఆశిద్దాం.
Read Also :
Balakrishna | నందమూరి బాలకృష్ణ ఫోకస్ మార్చారు!
Dil Raju | సినీ పరిశ్రమ నుండి తప్పుకుందామనుకున్నా దిల్‌రాజు
Allu Arjun | అల్లు అర్జున్ తొలిజీతం ఎంతో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

