Dil Raju | సినీ పరిశ్రమ నుండి తప్పుకుందామనుకున్నా దిల్‌రాజు
'దిల్'రాజు ఈ పేరు తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమైన పేరు. నవ్యమైన కథలతో ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనది. పంపిణీదారుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నిర్మాతగా అంచలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాందించుకున్నాడు.
‘దిల్’రాజు ఈ పేరు తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమైన పేరు. నవ్యమైన కథలతో ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనది. పంపిణీదారుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నిర్మాతగా అంచలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాందించుకున్నాడు. దిల్, ఆర్య, భధ్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బలగం వంటి మరపురాని సినిమాలు ఆయన సంస్థ నుంచి వచ్చినవే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఇప్పటి వరకు 50 సినిమాలకు పైగా నిర్మించి. ఎందరో కొత్త నిర్మాతలకు ఆదర్శప్రాయుడిగాన నిలిచిన దిల్ రాజు అలియాస్ వెంకట రమణారెడ్డి ఒకప్పుడు ఫెయిల్యూర్స్‌ను చూసి భయపడి ఆర్థికంగా నష్టపోయి సినీ పరిశ్రమ నుండి తప్పుకుందామనుకున్నాడట ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంగా తెలియజేశాడు.
ఒకప్పుడు ఆటోమైబైల్ బిజినెస్‌లో వున్న సినిమా అంటే ప్రేమతో సినిమా వ్యాపారంలోకి వద్దామనుకున్నా మా కజిన్ మహేందర్ రెడ్డితో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుని మొదలుపెట్టాను. ఐదు సినిమాలు పంపిణీచేశాం. అందులో నాలుగు సినిమా ఫెయిల్ అయ్యాయి. ఇక సినిమా రంగం నుంచి తప్పుకుందాము అనుకున్న సమయంలో నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఫోన్ చేసి కన్నడంలో ఓ సూపర్‌హిట్ సినిమా వుంది చూస్తావా అన్నారు. మనసు అయిష్టంగానే మరో సారి అదృష్టం పరీక్షించుకుందామని సినిమా చూశాను. నాకు తెగ నచ్చేసింది. అన్నయ్యలకు విషయం చెబితే రిస్క్ అవసరమా అన్నారు. నా మిత్రులు శిరీష్, లక్ష్మణ్‌లకు చెబితే ఓకే కలిసి చేద్దాం అన్నారు. అంతా ఫర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం.
ఈ సారి అటు ఇటు అయితే ఇక దుకాణం మూయాల్సిందే అనుకున్నాం. జగపతిబాబు, రాశిలతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. కోడి రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో పంపిణీ హక్కులు తీసుకున్నాం. ఆఖరికి సినిమా విడుదలైంది. టెన్షన్ పడ్డాం.. సాయంత్రానికి సినిమాకి సూపర్‌హిట్ టాక్ వచ్చేసింది. అప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయిన ఫీలింగ్ కలిగింది. అపజయాలు అన్నీ మరిచిపోయాను. ఇక తరువాత 1999లో శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పేరిట సినిమా పంపిణీ సంస్థని ప్రారంభించాం. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ పంపిణీదారుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాను’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
Read Also :
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Allu Arjun | అల్లు అర్జున్ తొలిజీతం ఎంతో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

