Japan | జపాన్ ఎవరు..? సస్పెన్స్ పెట్టిన కార్తీ టీం
Japan | కోలీవుడ్ యాక్టర్ కార్తీ (Karthi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan)అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం సస్పెన్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.
Japan | కోలీవుడ్ యాక్టర్ కార్తీ (Karthi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan). రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం సస్పెన్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇంతకీ జపాన్ ఎవరు..? ఇంట్రడక్షన్ వీడియో రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయబోతున్నామని ప్రకటించారు మేకర్స్. జపాన్ ఎవరోననే సస్పెన్స్‌పై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే జపాన్‌కు సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్లో కార్తీ, ఇతర నటీనటులపై వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఓ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. జపాన్ మూవీకి అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నాడు.
జపాన్‌లో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కార్తీ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న కార్తీ జపాన్‌తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.
Who’s #Japan?
Revealing tomorrow 11am 🔥Get Ready to be amazed ! @Karthi_Offl @ItsAnuEmmanuel #Sunil @vijaymilton @gvprakash @dop_ravivarman @ActionAnlarasu @philoedit #Banglan @YugabhaarathiYB @PraveenRaja_Off @Dir_Rajumurugan @Prabhu_sr #Karthi25 @JapanTheMovie… pic.twitter.com/rGggTwgnKO
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

