సినీరంగంలో నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ షార్ట్‌ఫిల్మ్ అవార్డ్స్ 2026ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌కు భారీగా ఎంట్రీలు వస్తున్నాయని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కె.గౌడ్ తెలిపారు. ఈ అవార్డుల కమిటీకి సీనియర్ నటి ఇంద్రజను జ్యూరీ ఛైర్మన్‌గా ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. దాదాపు 30 కేటగిరీల్లో మొదటి ఐదుగురు విజేతలకు అవార్డ్స్ అందిస్తామని, మొదటి ముగ్గురు విజేతలకు అవార్డ్స్ పాటు నగదు బహుమతిని కూడా అందిస్తామని తెలిపారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహిస్తామని ఆర్.కె.గౌడ్ పేర్కొన్నారు. ఔత్సాహికులైన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 13వరకు ఎంట్రీలకు సమయం ఉందని ఇంద్రజ తెలిపారు.