సినిమా బతికితేనే అందరం బాగుంటాం
‘రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు. నిజాయితీగా ఇచ్చే రివ్యూలను గౌరవిస్తాం. కానీ కొందరు సినిమాను చంపేయాలనే ఉద్దేశ్యంతో రివ్యూలు రాస్తున్నారు. అంతటితో ఆగకుండా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే.. అందరం బాగుంటాం అనే విషయాన్ని వారూ గ్రహించాలి.’
‘రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు. నిజాయితీగా ఇచ్చే రివ్యూలను గౌరవిస్తాం. కానీ కొందరు సినిమాను చంపేయాలనే ఉద్దేశ్యంతో రివ్యూలు రాస్తున్నారు. అంతటితో ఆగకుండా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే.. అందరం బాగుంటాం అనే విషయాన్ని వారూ గ్రహించాలి.’ అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఘాటుగా స్పందించారు. ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్కేర్’ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నాగవంశీ విలేకరులతో ముచ్చటించారు.
‘నాలుగు రోజుల్లోనే పంపిణీదారులంతా లాభాలబాట పట్టారు. తొలివారం టికెట్ రేట్లు పెంచాం. మంగళవారం నుంచి మాత్రం అన్ని చోట్లా సాధారణ ధరలే ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులకు సినిమాను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాగవంశీ పేర్కొన్నారు. భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా తమ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, దానికి వినోదమే కారణమని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్నే ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని నాగవంశీ అభిప్రాయపడ్డారు. నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

