Sampath Nandi| 700కు పైగా అమ్మాయిలను ఆడిషన్స్ చేశాం
Seetimaarr). సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు డైరెక్టర్ సంపత్ నంది షేర్ చేసుకున్నాడు.

టాలీవుడ్ (Tollywood) యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తోన్న తాజా చిత్రం సీటీమార్ (Seetimaarr). సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా ( Tamannaah) ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఆంధ్రా మహిళ టీంకబడ్డీ కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళ టీం కబడ్డీ కోచ్ గా తమన్నా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు డైరెక్టర్ సంపత్ నంది షేర్ చేసుకున్నాడు.
గ్రామం కోసం పెట్టుకున్న లక్ష్యాన్ని కబడ్డీ టీం ఎలా చేరుకున్నదన్నదే సినిమా స్టోరీ అంటూ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు సంపత్ నంది. అంతేకాదు కబడ్డీ క్రీడాకారుల పాత్రల కోసం 700కు పైగా అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించినట్టు చెప్పాడు. వారిలో 24 మందిని ఎంపిక చేసినట్టు తెలిపాడు. వీరిలో నలుగురు జాతీయ స్థాయి ప్లేయర్లు. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందు వారికి యాక్టింగ్‌లో శిక్షణ ఇచ్చామంటూ చెప్పుకొచ్చాడు.

నా స్వగ్రామం ఓదెలలో చిన్నతనం నుంచి కబడ్డీ చూస్తూ, ఆడుతూ పెరిగాను. మాస్ క్రీడ అయిన కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలని ఎప్పుడూ ఉండేది. ప్రొ కబడ్డీ లీగ్ చూసిన తర్వాత ఈ సినిమాకు కథ రాయడం మొదలుపెట్టానని తెలిపాడు. సీటీమార్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నాడు సంపత్ నంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

