Bunny Vasu | ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్విస్తున్నాం: బన్నీ వాసు
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొంది.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛావా’ చిత్రం తెలుగు వెర్షన్ ఈ నెల 7న తెలుగు రాష్ర్టాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీకౌశల్ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది.
Bunny Vasu | ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొంది.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛావా’ చిత్రం తెలుగు వెర్షన్ ఈ నెల 7న తెలుగు రాష్ర్టాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీకౌశల్ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత.. మొఘల్ ఆధిపత్య ముప్పును మరాఠా సామ్రాజ్యం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు.. శివాజీ వారసత్వం ఛత్రపతి శంభాజీ ద్వారా కొనసాగుతుంది.
‘సింహం పోవచ్చు.. కానీ దాని పిల్ల ఇప్పటికీ అడవిలో వేటాడుతూనే ఉంది..’ అనే పవర్ఫుల్ డైలాగ్‌తో శంభాజీ పాత్రని తెలుగు ప్రేక్షకులకు ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. శత్రువుల శక్తిసామర్థ్యాలు.. గెరిల్లా యుద్ధాలు.. శంభాజీ ధైర్యసాహసాలు.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుయుక్తలు.. ఈ ట్రైలర్లో చూడొచ్చు. ఔరంగజేబుగా అక్షయ్ఖన్నా, శంభాజీ ఇల్లాలు యేసుబాయిగా రష్మిక మందన్నా ఈ ట్రైలర్లో అలరించారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్విస్తున్నామని, భాష ఏదైనా అది మంచి సినిమా అయితే దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ ఎప్పుడూ ముందే ఉంటుందని, తమ సంస్థ నుంచి వచ్చిన గజనీ, కాంతారా చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని నిర్మాత బన్నీ వాసు నమ్మకం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

