భోపాల్: షారూక్ ఖాన్, దీపికా పదుకునే నటించిన పఠాన్ చిత్రానికి సంబంధించిన బేషరమ్ సాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్‌లో దీపిక వేసుకున్న దుస్తుల్ని మధ్యప్రదేశ్ నేతలు తప్పుపడుతున్నారు. ఆ ఫిల్మ్‌ను బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నారు. తాజాగా ఈ అంశంపై మధ్యప్రదేశ్ స్పీకర్ గిరీశ్ గౌతమ్ స్పందించారు. షారూక్ ఖాన్ ఈ సినిమాను తన కూతురుతో కలిసి చూడాలని, దానికి సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేయాలని, కూతురుతో కలిసి ఈ సినిమా చూశానన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని, ఇలాంటి సినిమానే ప్రవక్తపై తీయాలని షారూక్‌కు స్పీకర్ గౌతమ్ సవాల్ చేశారు.
పఠాన్ చిత్రం బ్యాన్ అంశాన్ని మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ సాంగ్‌పై ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో ఉన్న కాస్ట్యూమ్ అభ్యంతరకర రీతిలో ఉన్నాయని, ఇది కలుషితమైన మైండ్‌సెట్‌ను చాటుతుందని ఆయన ఆరోపించారు. పాటలో కొన్ని మార్పులు చేయాలని, లేదంటే ఆ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.