Ramayana VFX | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ్ (Ramayana). రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొందరు హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం కార్టూన్ నెట్వర్క్ గ్రాఫిక్స్‌లా ఉన్నాయంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ వ్యవహారంపై స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడుతూ.. రామాయణ కథను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువైన విషయం కాదని, దానికి ఎంతో కష్టం మరియు భారీ సాంకేతికత అవసరమని పేర్కొన్నారు. “ఒక చిన్న టీజర్ లేదా ట్రైలర్ చూసి సినిమాలోని గ్రాఫిక్స్ బాగోలేవని ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదు. కేవలం రెండు నిమిషాల విజువల్స్‌తో రెండున్నర గంటల సినిమాను జడ్జ్ చేయలేం. వెండితెరపై ఆ అద్భుతాన్ని చూసే వరకు అందరూ కాస్త ఓపిక పట్టాలి. పూర్తి సినిమా చూసిన తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటూ ప్రేక్షకులను హృతిక్ కోరాడు. దర్శకుడు నితేష్ తివారీపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన భారతీయ పురాణాలను అత్యద్భుతంగా చూపిస్తారని హృతిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హృతిక్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.