దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. శ్రీధర్ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ…‘వినోదాత్మక చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. జనార్థన మహర్షి చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నాం. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించాల్సి ఉండేది. నా గత సినిమా ‘పెళ్లి సందడికి’ మంచి డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన కథకు న్యాయం చేయగలడు అనిపించింది. ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాను. మంచి ఎంటర్టైనర్ ఇది. జూన్ చివరి వారం లేదా జూలై తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. ఆమని, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, సుడిగాలి సుధీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగుల, ఎడిటర్ : తమ్మిరాజు, సంగీతం : పీఆర్.