Vyuham Movie | ‘వ్యూహం’ మరింత ఆలస్యం.. సెన్సార్ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్ పొడిగించిన హైకోర్టు
Vyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు మరోసారి పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Vyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు మరోసారి పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో మూడు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
వాస్తవానికి గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేష్ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం గత బుధవారం విచారణ చేపట్టింది. సినిమా సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కోట్లల్లో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేయడంతో సినిమా విడుదలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

