వాలీబాల్ నేపథ్య స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాలీ’. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముల జీవితాలే ప్రధానాంశంగా రూపొందుతున్న ఈచిత్రం ద్వారా రోనిత్ జీఆర్జీ హీరోగా పరిచయం అవుతున్నారు. అభిగ్న్య వుత్తలూరు కథానాయిక. నిపుణ్ సత్య కీలక పాత్రధారి. దిలీప్ కె.మనుకొండ దర్శకుడు. జి.రోహన్‌రెడ్డి నిర్మాత. ఏపీలోని ఉప్పాడ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ పోస్టర్ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రవివర్మ, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీసాల, కిరణ్ వారణాసి, రమణ భార్గవ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం: దిలీప్ కె. మనుకొండ, పవన్ కె.విప్పర్తి, కెమెరా: అరుణ్ వీజేకే, సహ నిర్మాత: శ్రీనివాస్ కారంకి, సమర్పణ: జి.విక్రమ్‌రెడ్డి, నిర్మాణం: ఫైర్ వాటర్ ఎంటర్టైన్మెంట్స్.