Vivek Agnihotri | ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి వివాదస్పాద చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ‘ఆపరేషన్ సిందూర్’ (OperationSindoor) అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం కోసం ఆయన ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్‌తో (టీ-సిరీస్) చేతులు కలిపినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ‘టైనీ’ ధిల్లాన్ రాసిన (Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan) అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, భారత సాయుధ దళాలలోని వివిధ విభాగాలు సమన్వయంతో సాగించిన లోతైన పరిశోధనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. కేవలం శబ్దం చేయడం కోసం కాకుండా, వాస్తవాలను క్లారిటీతో, సినిమా మాయాజాలంతో ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి తమ ‘ఐ యామ్ బుద్ధ’ ప్రొడక్షన్స్‌పై టీ-సిరీస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bhushan Kumar and I have joined forces for #OperationSindoor— a story that redefined security in the subcontinent and exposed Pakistan’s nuclear bluff. The film is based on Lt Gen K.J.S. ‘Tiny’ Dhillon’s book Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside… pic.twitter.com/etequTSM6a
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 26, 2026