Vishwaksen | హాట్ టాపిక్‌గా విశ్వక్సేన్ రెమ్యునరేషన్.. ధమ్ కీ హిట్టయితే ఇక అంతే..!
ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు విశ్వక్సేన్ (Vishwaksen). ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండటంతో పెద్ద హీరోలతోపాటు చిన్న హీరోలు కూడా తమ మార్కెట్‌కు, సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా పారితోషికం పెంచేస్తున్నారు.
టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు విశ్వక్సేన్ (Vishwaksen). ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. సినిమా సినిమాకు యాక్టర్‌గా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండటంతో పెద్ద హీరోలు ఇప్పటికే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ (Remuneration) తీసుకుంటున్నారు. మరోవైపు చిన్న హీరోలు కూడా తమ మార్కెట్‌కు, సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా పారితోషికం పెంచేస్తున్నారు.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఇప్పటికే యువ హీరో నాగశౌర్య రెమ్యునరేషన్ నాలుగు కోట్లు దాటిపోయింది. ఇక ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వంతు వచ్చేసింది. ఈ కుర్ర హీరో ప్రస్తుతం నాలుగన్నర కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విశ్వక్ సేన్ ప్రస్తుతం ధమ్ కీ (Dhamki) విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ధమ్ కీ విశ్వక్సేన్ హోం ప్రొడక్షన్స్ లో వస్తోంది. విశ్వక్సేన్ ధమ్ కీ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ లో చేయబోతున్న సినిమా మేలో షురూ కానుంది. అయితే దీని తర్వాత విశ్వక్సేన్ మరే కొత్త సినిమాకు సైన్ చేయలేదు.
ఎవరైనా తనతో సినిమా చేయాలని వస్తే మాత్రం రెమ్యునరేషన్ విషయంలో విశ్వక్సేన్ తగ్గేదేలే అంటున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. విశ్వక్ సేన్ సినిమాలకు నైజాంలో మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో సినిమా సుమారు 3 కోట్ల వరకు గ్యారంటీగా రికవరీ చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ విశ్వక్ సేన్ నాలుగన్నర కోట్లు డిమాండ్ చేస్తే.. రూ.10 కోట్ల వరకు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలున్నట్టు ట్రేడ్ విశ్లేషకుల అంచనా.
ఈ నేపథ్యంలో నిర్మాతలు ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకొని, రెండున్నర నుంచి మూడు కోట్లు ఆఫర్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటామని నమ్ముతున్నట్టు టాక్ కూడా ఉంది. మొత్తానికి నిర్మాతల ఆలోచన మాటెలా ఉన్న విశ్వక్సేన్ మాత్రం తన రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫిక్సయినట్టు చర్చ నడుస్తోంది. ఒకవేళ ధమ్ కీ మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొడితే విశ్వక్సేన్ రెమ్యునరేషన్ అంశంలో భారీ మార్పులు వచ్చే అవకాశం లేకపోలేందంటున్నారు సినీ జనాలు.
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు లిరికల్ వీడియో
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ హిందీ లిరికల్ వీడియో
Read Also :
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Mangalavaaram | సస్పెన్స్ గా అజయ్ భూపతి మంగళవారం టైటిల్ లుక్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

