పొలిటికల్ లెగసీ
విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్‌రెడ్డి దైదా నిర్మాతలు. పవర్, ఫ్యామిలీ, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో రూపొందుతున్న ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా ఇదని, తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడు..
విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్‌రెడ్డి దైదా నిర్మాతలు. పవర్, ఫ్యామిలీ, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో రూపొందుతున్న ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా ఇదని, తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడు.. తన తండ్రి గతంలో దాగివున్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో తలపడుతూ.. తన లెగసీ భారాన్ని ఎలా మోశాడు? అనేది ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకూ చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో విశ్వక్సేన్ కనిపిస్తారని, ప్రముఖ నటుడు కేకే మేనన్ ఇందులో అత్యంత శక్తివంతుడైన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారని మేకర్స్ చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. గురువారం నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నెల రోజులపాటు భారీ షెడ్యూల్ జరుగనున్నది. ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన సన్నివేశాలతోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని, పాటలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీమోహన్, రావురమేశ్, సచిన్‌ఖేడేకర్, రాజారవీంద్ర, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, సంగీతం: గోవింద్ వసంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

