Vishwak Sen | స్పీడు మీదున్న విశ్వక్ సేన్ టీం.. VS 11 షూటింగ్ షెడ్యూల్స్ ఇవే
Vishwak sen | విశ్వక్సేన్ (Vishwak sen) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విశ్వక్ సేన్ 11 (VS 11). తాజాగా VS 11 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Vishwak sen | విశ్వక్సేన్ (Vishwak sen) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విశ్వక్ సేన్ 11 (VS 11). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మే 8న హైదరాబాద్‌లో VS 11 రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ మేరకు రామోజీ ఫిలిం సిటీలో ఓ సెట్ కూడా వేసినట్టు టాక్. ఇక విశ్వక్ సేన్ మే 15న షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
అంతేకాదు వచ్చే నెలలో సెకండ్ షెడ్యూల్ కోసం విశ్వక్ సేన్ టీం రాజమండ్రికి పయనం కానుందట. తాజా రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ చివరి కల్లా VS 11 షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో పొట్టి హెయిర్, కోరమీసంతో సరికొత్తగా కనిపించబోతున్నాడు విశ్వక్సేన్.
విశ్వక్ సేన్ మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న గామి (Gaami)లో కూడా నటిస్తున్నాడు. గామిలో విశ్వక్సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో కలర్ ఫొటో ఫేం చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. మరోవైపు ధమ్ కీ 2 కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Mass Ka Das @VishwakSenActor ~ #VS11 Begins! 🔥
Shoot commences from Mid of May 2023! ❤️🔥
🎶 @thisisysr
✍️& 🎬 #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/wLWnHwAg0b— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

