VS10 | మాస్ కా దాస్ ఫుల్ బిజీ గురూ.. విశ్వక్సేన్-రవితేజ సినిమాపై తాజా అప్డేట్
VS10 | విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని అప్డేట్ వచ్చింది. తాజాగా ప్రొడక్షన్ టీం మంగళవారం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసింది.
VS10 | మూవీ లవర్స్‌కు పక్కా వినోదాన్ని అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు విశ్వక్సేన్ (Vishwak Sen). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. విశ్వక్సేన్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని అప్డేట్ వచ్చింది. తాజాగా ప్రొడక్షన్ టీం మంగళవారం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) షూటింగ్‌పై ఫోకస్ పెట్టాడని ఇన్సైడ్ టాక్. విశ్వక్ సేన్ 11 (VS 11)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పూర్తవగానే VS 10 షూటింగ్‌ను రీస్టార్ట్ చేయనున్నాడట. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ దీంతోపాటు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అఘోరాగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కలర్ ఫొటో ఫేం చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోండగా.. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ మరోవైపు ధమ్ కీ సీక్వెల్ కూడా ప్రకటించాడని తెలిసిందే. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా మారిపోయి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు మాస్ కా దాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

