మాఫియా నేపథ్యంలో ‘బ్యాడ్’
ఇటీవలే ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో విశ్వక్సేన్. బుధవారం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ‘బ్యాడ్' పేరుతో తెరకెక్కబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కృష్ణచైతన్య దర్శకుడు.
ఇటీవలే ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో విశ్వక్సేన్. బుధవారం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ‘బ్యాడ్’ పేరుతో తెరకెక్కబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కృష్ణచైతన్య దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ వీడియో ఉత్కంఠను పంచింది. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు..గ్రే మాత్రమే ఉంటుంది’ అనే సంభాషణతో వీడియోను ఆసక్తికరంగా రూపొందించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కించబోతున్న పీరియాడిక్ ఫిల్మ్ ఇదని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్ రాజా, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, సహనిర్మాతలు: వెంకట్, గోపి, దర్శకుడు: కృష్ణచైతన్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bad
- Das ka dhamki
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

