ట్రోలర్స్ నన్ను ఏమీ చేయలేరు
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు.
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం వరంగల్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘నేను సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడిన వీడియోలను కట్ చేసి..వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ కొందరు వ్యక్తులు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. సోషల్‌మీడియా వేదికల్లో నన్ను ట్రోల్ చేసేవారి గురించి అస్సలు పట్టించుకోను. ట్రోలర్స్ నన్ను ఏమీ చేయలేరు. నా సినిమాల గురించి ఎవరు ఎలా విశ్లేషించినా ఫర్వాలేదు.
అది వాళ్లకున్న స్వేచ్ఛ అనుకుంటా. కానీ నన్ను పర్సనల్‌గా అటాక్ చేస్తే మాత్రం ఊరుకోను. హిట్టయినా, ఫ్లాపయినా సినిమాలు చేస్తూనే ఉంటా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మెకానిక్ రాకీ’ విభిన్నంగా నిలుస్తుంది. 21వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం’ అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ‘విశ్వక్సేన్ చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

