సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకుడు. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నారాయణ కుటుంబంలోని పాత్రలన్నీ చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. ప్రతి పాత్ర వినోదాన్ని పంచుతుంది.కొతదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా మా చిత్రం నచ్చుతుంది’ అన్నారు.