Vishwak Sen | న్యూ ఇయర్లో నయా జోష్.. విశ్వక్ సేన్ పొలిటికల్ డ్రామా
Vishwak Sen | విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ సినిమానే ఆశలు పెట్టుకోగా.. ఈ మూవీ 2026 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కొత్త సంవత్సరం కొత్త ఎనర్జీతో నయా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నాడు విశ్వక్ సేన్.
Vishwak Sen | టాలీవుడ్లో ఉన్న యంగ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు విశ్వక్ సేన్. కెరీర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ మాస్ కా దాస్‌కు 2025 ఇయర్ మాత్రం నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన లైలా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. ఇక ప్రస్తుతం ఫంకీ సినిమానే ఆశలు పెట్టుకోగా.. ఈ మూవీ 2026 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కొత్త సంవత్సరం కొత్త ఎనర్జీతో నయా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నాడు విశ్వక్ సేన్.
ఈ సారి పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. పిండం సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన డైరెక్టర్ సాయి కిరణ్ దైదా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. పిండం సినిమాను నిర్మించిన కలాహి మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి 1న సాయంత్రం 5 గంటలకు అనౌన్స్మెంట్ టీజర్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. సింహాసనం ఫొటోను ప్రీ లుక్‌లో చూడొచ్చు.
సాయి కిరణ్ దైదా చెప్పిన కథ ఇంప్రెస్ చేయడంతో విశ్వక్ సేన్ ఒకే చెప్పేశాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే విశ్వక్ సేన ఖాతాలో ఈ నగరానికి ఏమైంది 2 కూడా ఉంది.
Politics is Personal.@Kalaahi_Media #ProductionNo2
Announcement Teaser on January 1st 2026, 5 PM.
Wishing everyone a powerful and prosperous New Year!! pic.twitter.com/eNAmHD1lgJ
— Kalaahi Media (@Kalaahi_Media) December 31, 2025
Read Also :
Sunny Leone | న్యూ ఇయర్ వేడుకల వేళ సన్నీ లియోన్‌కి షాక్.. ఈవెంట్ రద్దు ..!
Samantha – Raj | లిస్బన్ వీధుల్లో సమంత-రాజ్ నిడిమోరు హనీమూన్ సందడి.. ఫోటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

