Vishwak Sen| Pagal | నా మాటల్ని వెనక్కి తీసుకోను!

‘ప్రేమ ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప కథ ఇది. తల్లిప్రేమను అన్వేషిస్తూ ఓ యువకుడు సాగించే ప్రయాణాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించాం’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకుడు. దిల్రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విశ్వక్సేన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఫలితం విషయంలో గత చిత్రాల కంటే ఎక్కువ నమ్మకంతో కనిపిస్తున్నారు?
నిజాయితీగా మనం ఎవర్నీ ప్రేమించినా వాళ్లు తిరిగి మనల్ని ప్రేమిస్తారు అని తల్లి చెప్పిన మాటకు కట్టుబడే ఓ యువకుడి కథ ఇది. తల్లి ప్రేమ కోసం పరితపించే అతడు ఆ ప్రేమను తిరిగి పొందడానికి ఏం చేశాడన్నది మనసుల్ని కదిలిస్తుంది. ప్రేమ, వినోదంతో పాటు అంతర్లీనంగా వచ్చే తల్లీకొడుకుల అనుబంధం ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం నవ్విస్తుంది. ద్వితీయార్థం కన్నీళ్లుపెట్టిస్తుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా పేరు మార్చుకుంటానని చాలెంజ్ చేశారు?
ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన ఏ మాటనీ వెనక్కి తీసుకోను. నాతో పాటు నా స్నేహితులందరూ సినిమా చూశారు. వారందరూ ‘నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. అంతగా వారందరికీ ఈ సినిమా నచ్చింది. ప్రమోషన్స్ కూడా అవసరం లేదని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. ఎమోషనల్ సన్నివేశాల్లో నా నటన బాగుందని చెప్పారు. ఈ సినిమాతో తిరిగి థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకముంది. అదే జరిగితే నటుడిగా అంతకుమించిన సంతృప్తి ఏదీ లేదు.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
కథతో కనెక్ట్ అయ్యి ఏడాదిన్నర పాటు ప్రతి ఒక్కరం శ్రమించి ఈ సినిమా చేశాం. పతాక ఘట్టాలు అలరిస్తాయి. నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఇబ్బందులు ఎదురైతే ఇండస్ట్రీలో నాకు అండగా నిలిచేవారు, సహాయం చేసేవారూ లేరు. నాని, రానా, మంచు మనోజ్తో పాటు కొందరు మాత్రమే నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులు, విమర్శకులు సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తారనే నమ్మకముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

