బతుకు ప్రారంభంలో వినాల్సినది భగవద్గీత
‘జీవితాన్ని ఎలా కావాలని కోరుకుంటున్నామో అలా మార్చేది భగవద్గీత. జీవితంలో ఎటు వెళ్లాలని కోరుకుంటున్నామో అటు తీసుకెళ్లేది భగవద్గీత. కృష్ణభగవానుడు బోధించిన భగవద్గీతను ఎందరో మహనీయులు తాత్పర్యం చెడకుండా పునః రచించారు.
‘జీవితాన్ని ఎలా కావాలని కోరుకుంటున్నామో అలా మార్చేది భగవద్గీత. జీవితంలో ఎటు వెళ్లాలని కోరుకుంటున్నామో అటు తీసుకెళ్లేది భగవద్గీత. కృష్ణభగవానుడు బోధించిన భగవద్గీతను ఎందరో మహనీయులు తాత్పర్యం చెడకుండా పునఃరచించారు. వారిలో స్వామి ముకుందనంద రాసిన గీత అందరికీ సులువుగా అర్థమయ్యేలా వుంటుంది. యువతను దృష్టిలోపెట్టకుని చేసిన భగవద్గీత ఇది. బతుకు మొదలుపెట్టేముందు వినాల్సినది భగవద్గీత’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన రికార్డ్ చేసిన ‘సంపూర్ణ భగవద్గీత’ తాత్పర్యంలోని విశ్వరూప సందర్శనం అధ్యాయాన్ని హీరో విశ్వక్సేన్ సోమవారం లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడారు. ‘ఇది భగవానుడు నాతో చేయించిన కార్యం. నేను నిమిత్తమాత్రుడ్ని. ఈ ప్రయాణంలో తోడ్పడిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం, విశ్వరూప సందర్శన అధ్యాయం నేను విడుదల చేయడం నా అదృష్టం. భగవద్గీత తాత్పర్యం అందరికీ అర్థమయ్యేలా రికార్డ్‌చేసిన ఆర్పీ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నిజంగా చాలా గొప్ప కార్యం’ అన్నారు విశ్వక్సేన్. ఇది చిరకాలం నిలిచివుండే ప్రాజెక్ట్ అని దర్శకుడు దశరథ్, జె.కె.భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సరేశ్ తదితరులు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

