ఇన్నాళ్ల నా సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన విషయం తెలిసిందే. సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది.
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన విషయం తెలిసిందే. సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్, నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
‘ఈ కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు నిజాయితీగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ట్రైలర్లో కొన్ని ఇబ్బందికరమైన సంభాషణలు చేర్చడం జరిగింది. సినిమాలో వాటిని మ్యూట్ చేశాం. కథ విన్నప్పుడు ఇది కేవలం యువతరం సినిమా అనుకున్నా. కానీ ఫైనల్ కాపీ చూశాక తెలిసింది.. ఇది అందరూ చూడాల్సిన సినిమా అని. కమర్షియల్ అంశాలు ఉంటేనే కొత్తగా ఉంటుందీ సినిమా.
ఇందులో గోదావరి యాస మాట్లాడాను. ఎవ్వరూ నన్ను వేలెత్తి చూపించకూడదని ఒకటి పది సార్లు జాగ్రత్తగా చూసుకొని సంభాషణలు పలికాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ఈ సినిమా ఒకెత్తు. ఇన్నాళ్ల నా నటన కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా రేపు చూడబోతున్నారు. ఇందులో వయసుకు మించిన పాత్ర చేశాను. ఇందులో నా పేరు లంకల రత్న. దీనికి సీక్వెల్ కూడా ఉంది. అది కూడా నేనే చేస్తా’ అని తెలిపారు విశ్వక్సేన్.
తెలుగులో ఇదొక కొత్త ఫార్ములా అని, గోదావరి ప్రాంతానికి చెందిన లంకల రత్న అనే స్లమ్ కుర్రాడు, రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ అని, కమర్షియల్ అంశాలు ఉంటూనే, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని నాగవంశీ తెలిపారు. సాంకేతికంగా కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, యువన్ శంకర్రాజాను సంగీత దర్శకుడిగా ఎందుకు తీసుకున్నామో ఈ సినిమా చూశాక అందరికీ తెలుస్తుందని నాగవంశీ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

