Vishal | సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి వివాదం అవసరమా విశాల్..?
తన సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా.. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడం విశాల్ స్టైల్. తమిళ ఇండస్ట్రీ వరకు ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టే ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఈయన. కానీ మొదటి సారి తెలుగులో కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ లో నిలిచాడు విశాల్.
తమిళ ఇండస్ట్రీలో వివాదాలను విశాల్ (Vishal)ను విడదీసి చూడలేము. అక్కడ మనోడు ఎప్పుడూ కేరాఫ్ కాంట్రవర్సీ ఉంటాడు. తన సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా.. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడం విశాల్ స్టైల్. తమిళ ఇండస్ట్రీ వరకు ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్టే ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఈయన. కానీ మొదటి సారి తెలుగులో కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ లో నిలిచాడు విశాల్. లాఠీ (Laththi) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విశాల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. సినిమాకు ఉన్న ఇమేజ్ చాలదు ఇంకా ప్రమోషన్ కావాలి అనుకున్నాడో ఏమో కానీ ఒకేసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), వైఎస్ జగన్ (YS Jagan)పేర్లు వాడుకొని బాగా ట్రెండ్ అయిపోయాడు విశాల్. అయితే ఈ క్రమంలో విషయాలు చేసిన కామెంట్స్ జగన్ అభిమానులకు బాగా నచ్చాయి కానీ.. పవన్ అభిమానులకు మాత్రం మంట పెట్టించాయి. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతూ అతిపెద్ద అభిమానిని అని.. ఆయన సినిమాలు చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.

సినిమాల పరంగా పవన్‌ను అభిమానిస్తా.. కానీ
సినిమాల పరంగా పవన్ ను తాను చాలా అభిమానిస్తానని చెప్పిన విశాల్.. రాజకీయపరంగా మాత్రం వైఎస్ జగన్ కే తన ఓటు అని చెప్పి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రాజకీయం అంటే సినిమా ఇండస్ట్రీ కాదని బయట ఉండి కూడా సమాజ సేవ చేయొచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక్కడే పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. నీకు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ పేరు కావాలి కానీ రాజకీయంగా మాత్రం వైఎస్ జగన్ ఆశీర్వాదం కావాలి.. ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు అవకాశవాదిగా మారుతున్నావు అంటూ విశాల్ ను టార్గెట్ చేశారు పవన్ అభిమానులు.
దీనికి కారణం కూడా లేకపోలేదు గతంలో ఒకసారి మాట్లాడుతూ ఆయన ప్రభాస్ కు అతిపెద్ద అభిమాని అని చెప్పాడు.. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ టైం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ చెప్పుకుంటున్నాడని సోషల్ మీడియాలో పాత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏదేమైనా సినిమా విడుదల సమయంలో ఇలాంటి అనవసరపు వివాదాలు అవసరమా అంటూ విశాల్ కు హితబోధ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

