Venu Udugula | నీది నాది ఒకే కథ, విరాటపర్వం (Virata Parvam) సినిమాలతో డైరెక్టర్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఉడుగుల (Venu Udugula). రానా, సాయిపల్లవి కాంబోలో వచ్చిన విరాట పర్వం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే విరాటపర్వం తర్వాత వేణు కాంపౌండ్ నుంచి రాబోయే సినిమా ఏంటనేదాని గురించి తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. వేణు ఉడుగుల ఈ సారి ఎలాంటి సినిమాతో రాబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ చేయనున్న చిత్రం టాలీవుడ్ టాప్ బ్యానర్లో ఉండబోతుందని సమాచారం. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ గ్రామీణ కథాంశంతో పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందట. ఈ మూవీ షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగనుందని ఇన్సైడ్ టాక్. తెలుగు, తమిళంలో సూపర్ క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరో ఈ సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నాడని సమాచారం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే షురూ కానుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. మొత్తానికి వేణు ఉడుగుల మరోసారి తెలంగాణ నేపథ్యంలో సాగే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయబోతున్నాడన్న అప్డేట్ మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.