Nayanthara | అర్ధరాత్రి రోడ్డుపై ఐస్‌క్రీమ్ తింటూ.. ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న నయన్.. VIDEO
Nayanthara | దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార (Nayanthara) నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ (ice cream)ని ఎంజాయ్ చేసింది.
Nayanthara | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నది నయనతార (Nayanthara). అభిమానులు ఆమెను లేడీ సూపర్‌స్టార్ అని అభివర్ణిస్తారు. గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన చిత్రాల ద్వారా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ భామ. పెళ్లై ఇద్దరు పిల్లకు తల్లైనా తన ఫామ్ మాత్రం తగ్గడం లేదు. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక నయనతారే కావడం విశేషం. ఓ వైపు సినిమాలు, సొంత బిజినెస్‌లూ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని కూడా విజయవంతంగా లీడ్ చేస్తోంది. వీటితోపాటు అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతోంది.
ప్రస్తుతం నయన్ తన హోమ్టౌన్ కేరళ (Kerala)కు వెళ్లింది. అక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని గడుపుతోంది. ఈ సందర్భంగా నయన్ నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ (ice cream)ని ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో నయన్ ఎంతో సరదాగా గడిపినట్లు కనిపించింది. ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే తనిష్క్ షోరూమ్‌పై నయనతార బ్యానర్ ఒకటి కనిపించింది. అది చూసిన ఆ ఇద్దరు స్నేహితులు నయన్‌ని ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2024
Also Read..
Kalki 2898 AD | ‘కల్కి’ సెట్స్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ దిగిన దిశా పటానీ.. ఫొటోలు వైరల్
Family Star | ‘ఫ్యామిలీ స్టార్’ రివ్యూ: సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ట్రీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

