Srikanth Movie | రాజ్ కుమార్ రావు హీరోగా తెలుగు అంధ పారిశ్రామికవేత్త బయోపిక్.. ‘శ్రీకాంత్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Srikanth Bolla Biopic | ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది అటల్ (Main Atal Hoon), ది గోట్ లైఫ్ (The Goat Life) అంటూ సినిమాలు రాగా ఈ నెలలో మైదాన్(Maidaan) అంటూ అజయ్ దేవ్గన్ మరో బయెపిక్తో రాబోతున్నాడు.
Srikanth Bolla Biopic | ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది అటల్ (Main Atal Hoon), ది గోట్ లైఫ్ (The Goat Life) అంటూ సినిమాలు రాగా ఈ నెలలో మైదాన్(Maidaan) అంటూ అజయ్ దేవ్గన్ మరో బయెపిక్తో రాబోతున్నాడు. అయితే ఇప్పటివరకు మనం రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారుల జీవితాలను మాత్రమే బయోపిక్‌లుగా చూశాం. అయితే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త లైఫ్ స్టోరీ తెరపై ఆవిష్కృతం కానుంది. అదికూడా తెలుగువారు కావడం విశేషం.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా గురించి తెలిసిందే. హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. చివరికి హైదరాబాద్‌లో బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.
‘శ్రీకాంత్’ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. తుషార్ హీరానందానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జ్యోతిక, శరద్ కేల్కర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఈ పోస్టర్లో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్రలో జీవించాడు అని తెలుస్తుంది. టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. 2024 మే 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.
First look teaser of #Srikanth starring #RajkummarRao.
In theatres MAY 10pic.twitter.com/MxwH8OOHpO
— Movie Track (@movieztrack) April 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

