నెగెటివ్ పాత్ర అని భయపడ్డా

‘ప్రేమకథలతో పాటు అభినయానికి ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలతో నటుడిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుంది’ అని అన్నారు విరాజ్ అశ్విన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. ఇటీవల ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది. విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘పతాక ఘట్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని, ఆ సన్నివేశాల్లో నా నటన ఆకట్టుకుంటుందని అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ప్రారంభమై పాజిటివ్‌గా మారుతుంది. కథ చెప్పినప్పుడు నెగెటివ్ పాత్ర అయితే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడ్డా. నటుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడే సినిమా అనిపించింది. రొమాంటిక్ సీన్స్‌ను ఇదివరకు చేయలేదు. ఆ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిపడ్డా. ప్రస్తుతం ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంతో పాటు ఆంథాలజీ సినిమాలో నటిస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

