Viplava Veerudu | భారత స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో, సామాన్య ప్రజల వీరోచిత పోరాటాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నటి ఇంద్రజ మాట్లాడుతూ, తన పాత్రపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాను. బ్రిటిష్ వారిని ఎదురించి సామాన్యులు చేసిన పోరాటమే ఈ సినిమా. చరిత్రను ప్రతిబింబించే ఇలాంటి అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని ఆమె పేర్కొన్నారు.
నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ, ఇది టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ అని వివరించారు. వ్యాపారం పేరుతో దేశంలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ వారు, భారతీయులను ఎలా దోచుకున్నారనే అంశాలను ఇందులో సహజంగా చూపిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు నాగరాజు రావు మాట్లాడుతూ, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, చరిత్రలో నిలిచిపోయేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
హీరో జైశ్వర్ మాట్లాడుతూ.. విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ.. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలని అన్నారు.
విభాగం వివరాలు
బ్యానర్ :AVJR ప్రొడక్షన్స్
నటీనటులు : ఇంద్రజ, జైశ్వర్, సోనాలి శెట్టి, కిషోర్, రాగిణి ప్రజ్వల్ తదితరులు
దర్శకత్వం :ఎస్. నాగరాజ్ రావు
నిర్మాత : ఏవీ జయరాం
సంగీతం : ఉదయ్
ఛాయాగ్రహణం : (DOP) మాత్యు రాజన్
ఎడిటర్ : MNR
PRO : అశోక్ దయ్యాల