12th Fail Movie | ఓటీటీలోకి రాబోతున్న హిందీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘12th ఫెయిల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
12th Fail | బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘గ్యాస్‌లైట్’ ‘ముంబైకర్ సినిమాలలో కనిపించి అలరించాడు.
12th Fail | బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ఈ ఏడాది ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘గ్యాస్‌లైట్’ ‘ముంబైకర్ సినిమాలలో కనిపించి అలరించాడు. ఇక విక్రాంత్ మాస్సే తాజాగా నటించిన చిత్రం 12 ఫెయిల్(12th Fail). పీకే, త్రీ ఇడియట్స్ సినిమాల నిర్మాత విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న రిలీజైన ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్లు వసుళ్లు చేసింది. ఇక థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం డిసెంబర్ 29 నుంచి హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

