Vikramarkudu: విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్..దర్శకుడు ఎవరో తెలుసా?

రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2006 సంవత్సరం విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘విక్రమార్కుడు’ కథకు మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ కథ రెడీ చేశారట రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సీక్వల్‌కి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేవని అంటున్నారు. రాజమౌళి రానున్న రోజులలో వేరే హీరోల సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రాజమౌళి తరువాత తెలుగులో ఈ తరహా మాస్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో వినాయక్ .. పూరి సిద్ధహస్తులు. ఇక ఇదే కంటెంట్ ను కాస్త స్టైలిష్ గా తెరకెక్కించాలంటే సురేందర్ రెడ్డి వల్లనే అవుతుంది. ఈ ముగ్గురిలోఒకరు విక్రమార్కుడు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. విక్రమార్కుడు చిత్రంలో అనుష్క కథానాయికగా నటించగా, సీక్వెల్‌కి కూడా ఆమె డేట్స్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

