Thalapathy Vijay | ఆ సినిమాకి 250 కోట్లు తీసుకుంటున్న దళపతి విజయ్?
Thalapathy Vijay | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చివరి సినిమా సన్నాహాల్లో ఉన్నారు. విజయ్ 69వ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా విజయ్ రాజకీయ అరంగేట్రానికి ఊపునిచ్చే విధంగా ఉంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ యువ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇదిలావుండగా ఈ సినిమా కోసం విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. విజయ్ చివర చిత్రం కావడంతో వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు విజయ్ 250 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను తీసుకోబోతున్నారని సమాచారం. అదేగనుక నిజమైతే భారతీయ చిత్రసీమలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలో నటిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకుడు. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- DVV Danaiah
- Goat
- LEO
- Remunerations
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!